మొదటిరోజు హైడ్రా ప్రజావాణికి 83 ఫిర్యాదులు..! 1 d ago
TG: హైదరాబాద్ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి కొనసాగింది. ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.